Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 80 లక్షలతో నిర్మాణం : సొసైటీ చైర్మన్ బోబోలు లక్ష్మణ్‌రావు
నవతెలంగాణ-కల్లూరు
కల్లూరు సొసైటీ భవనం, గోడౌన్, నిర్మాణం కోసం శుక్రవారం సొసైటీ చైర్మన్ బోబోలు. లక్ష్మణరావు భూమి పూజ చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎన్నో సంవత్సరాల నుండి అద్దె భవనాల్లో సొసైటీ కార్య క్రమాలను నిర్వహిస్తున్నారు. గత అనేక సంవత్సరాల నుండి సొసైటీ కోసం స్థల సేకరణ అన్వేషిస్తున్నారు. సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య చొరవ తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేశారు. దీంతో కప్పల బందరు రోడ్డులో గల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు సొసైటీ నిర్మాణానికి కేటాయించటంతో సొసైటీ పక్కాభవనం సొంతంగా నిర్మించడానికి అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ బోబోలు లక్ష్మణరావు మాట్లాడుతూ సొసైటీ భవనం, గోడౌన్, నిర్మాణం కోసం నాబార్డ్ నుండి రూ.68 లక్షలు మంజూరు కాగా మిగిలిన 12 లక్షలు సొసైటీ నుండి కేటాయించినట్లు తెలిపారు. సొసైటీ స్థలాన్ని కోసం సహకరించిన సత్తుపల్లి శాసన సభ్యుల సండ్ర వెంకట వీరయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రామిశెట్టి కొండల్రావు, డైరక్ట్ర్ స్థానిక .శ్రీనివాసరావు, బత్తులపల్లి సర్పంచ్ శీలం సత్యనారాయణ రెడ్డి, తల్లపురెడ్డి హనిమిరెడ్డి, సీఈవో బీరవల్లి శ్రీనివాసరావు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.