Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100 ఓట్లు కూడా వేయించలేని వారు రాజీనామా చేస్తే పార్టీకి నష్టంలేదు
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-కొత్తగూడెం
నిలబడి పోరాడే ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారని, కనీసం వ్యక్తి గతంగా 100 ఓట్లు కూడా వేయించలేని వారు రాజీనామా చేస్తే పార్టీకి ఎలాంటి నష్టంలేదని, జలగం వెంకటరావు ఏపార్టీలో ఉన్నారు..? ఏపార్టీ నుండి పోటీ చేస్తారు మాకు తెలియదని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కొత్తగూడెం రైటర్స్ బస్తీలో విప్ క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, రైతు బంధు, దళిత బంధు, 24 గంటల విద్యుత్, ఇంటింటికీ తాగునీటి సౌకర్యం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా కేసీఆర్ పరిపాలన సాగుతోందన్నారు. ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే రేగా సమాధానాలు ఘాటుగా స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాజీనామాపై మాట్లాడుతూ పోటీని తట్టుకోలేని వారు, ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారన్నారు. సొంత నియోజక వర్గం, పినపాక, కరకగూడెం జెడ్పీటీసీ రాజీనామాపై స్పందిస్తూ వ్యక్తిగతంగా 100 ఓట్లు కూడా రాబట్టుకోలేని వారు రాజీనామా చేస్తే పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో జలగం వెంకటరావు కొత్తగూడెం నుండి పోటీ చేస్తారని గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన ఏ పార్టీ ఉన్నారో తెలియదు...? ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో మాకు తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా.. ఆయన ఎలా పోటీ చేస్తారన్నారు. ఇంకా అధిష్టానం ఎవరికీ టికెట్లు ప్రకటించలేదన్నారు. లీడర్లు కంగారుపడి తొందరపాటు నిర్ణయాలు, ప్రకటనలు ఇస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న పోడు భూముల సమస్యపై స్పందిస్తూ పోడు భూముల వ్యవహారంలో తగ్గేది లేదన్నారు. పోడు సాగు దారులందరికీ పట్టాలు ఇప్పించడానికి సాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, జిల్లా గ్రంధా లయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కొత్తగూ డెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్, మణుగూరు, ఇల్లందు, జూలూ రుపాడు జడ్పీటసీలు నరసింహా రావు, ఉమా దేవి, కళావతి, రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్. రాజు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.