Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
దేశ ప్రయోజనాల కోసం, దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు నేడు రాష్ట్రంలో దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని రక్షించు బాధ్యత యువత తీసుకోవాలని మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం అన్నారు. కొదుమూరు గ్రామంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణా తరగతులు ప్రారంభ ఉపన్యాసంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నాటి స్వతంత్ర పోరాటం, వీర తెలంగాణ రైతాంగ పోరాటం, విద్యుత్ చార్జీలు పెంచి నప్పుడు చేసిన పోరాట అన్నిటిలోనూ యువత కీలక పాత్ర పోషించారని అన్నారు. అనంతరం ''మతం మతోన్మాదం అనే అంశంపై డివైఎఫ్ఐ రాష్ట్ర మాజీ నాయకులు బండారు రవికుమార్ మాట్లాడుతూ బిజెపి ఆర్ఎస్ఎస్ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద రాజకీయలు పెరిగిపోయాయని, ముఖ్యంగా ముస్లింలు, దళితులు గిరిజనుల పై దాడులు పెరిగిపోయాయని, కమ్యూనిస్టు అంబేద్కర్వా దులను, అభ్యుదయ కవులు రచయితలను, ఎదురించిన ప్రతి వారిని, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ప్రతివారిపై కేసులు పెట్టడం వారిని బెదిరించడం జరుగుతుందన్నారు. తొలుత డివైఎఫ్ఐ, జెండాను రాష్ట్ర అధ్యక్షుడు కోట మహేష్ జెండా ఆవిష్కరించారు. ఈ సమావేశ ప్రారంభంలో జిల్లా కార్యదర్శి బషీరుద్దిన్ అమరవీరులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమావేశానికి రాష్టవ్యాప్తంగా సుమారు 250 మంది ప్రతినిధులు హజరవ్వగా శిక్షణా తరగతులకు వచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్. బషీరుద్దీన్, అధ్యక్షులు మద్దాల ప్రభాకర్, డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు మడుపల్లి గోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వత్సవాయి జానకి రాములు మాజీ ఎంపిటిసి, రాచ బంటి రాము, డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు భయ్యా బాలాజీ, గడ్డం విజరు,డివైఎఫ్ఐ చింతకాని మండల కమిటీ సభ్యులు పలు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.