Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
- ఎమ్మెల్యే పొదేం వీరయ్య
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వార్తా సేకరణలో ముందుండి పనిచేసిన విలేకరుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జూలై 3వ తేదీన భద్రాచలం పట్టణంలోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహించే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రెండవ జిల్లా మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైంది అని ఆయన అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని జర్నలిస్టుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ ప్రాంతాలలో సైతం మండల కేంద్రంలో పనిచేసిన విలేకరులకు ఇంటి స్థలాలతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. జర్నలిస్టుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జిల్లా అక్రిడేషన్ మెంబర్ కర్ర అనిల్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు భోగాల శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు బుడగం శ్రీనివాస్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కటారి కృష్ణ, జాయింట్ సెక్రెటరీ డి రవికుమార్, కోశాధికారి వెంకటేశ్వర్లు, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు పూదోట సూరిబాబు, సభ్యులు సుధీర్, సంపత్ రెడ్డి, పుష్పగిరి, రాజేష్, కౌశిక్, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.