Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్
నవతెలంగాణ-భద్రాచలం
గత ఐదేండ్ల నుంచి ఏ ప్రభుత్వం తీసుకొని సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకొని గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎంపిక ప్రక్రియ ప్రారంభించినందున, దానిని గిరిజన యువతీ, యువకులు సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ శిక్షణా శిబిరం సందర్శించి యువతీ, యువకులకు పలు సూచనలు చేశారు. గిరిజన సంక్షేమం కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నదని, దానిలో భాగంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ శిక్షణా శిబిరాలు ప్రారంభించటం జరిగిందన్నారు. విశాల వంతమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలు నేర్పుతున్న అంశాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని పరీక్షలు బాగా రాయాలని అన్నారు. అనంతరం ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్‌ను ఐటీడీఏ ఏపీఎం ఆర్సి అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఏసీఎంఓ రమణయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, పీఎంఆర్సీ సిబ్బందిపాల్గొన్నారు.