Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్ష అధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
సైనికులకు నాలుగు సంవత్సరాలకు కాంట్రాక్ట్ సైనికులుగా మార్చే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, ఏఐకేఎంఎస్ ముద్ద బిక్షం డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సైనికులను మూడు విభాగాలకు చెందిన అధికారులను దిగువ స్థాయికి చెందిన సైనికులను నియమించే విధానంలో ఇప్పటి వరకు అనుసరించే విధానం రద్దుచేసి నూతన పథకం అగ్నిపథ్ పేరుతో జూన్ 14న ప్రకటించిందని తెలిపారు. ఈ విధానం అన్యాయమని పేర్కోన్నారు. సైన్యంలో 70 శాతం మంది రైతు కూలీలు కుటుంబాల నుండి ఉంటున్నారని, వారు ఆర్థిక సామాజిక భద్రత కోరుకోవడం సహజం కానీ అగ్ని పథకం యువత ఆశ నిరాశ పర్చుతున్నదన్నారు. అనంతర అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు ఉప్పెనపల్లి నాగేశ్వరరావు, భూక్య శంఖర్, ఎఐకెఎంఎస్ జిల్లా నాయకులు అమర్లపూడి రాము, జాటోత్ కృష్ణ, నూపా భాస్కర్, కె.కిషోర్, బి.ధర్మా, ఎన్.రాంబాబు, పద్మ, సరోజిని పాల్గొన్నారు.