Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి
- ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన కిమ్స్ వైద్యశాల
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పరిసర ప్రాంత ఏజెన్సీ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చి, నాణ్యమైన వైద్యం అందించడం కోసమే భద్రాచలంలో కిమ్స్ వైద్యశాల ప్రారంభిస్తున్నామని మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కిమ్స్ వైద్యశాలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మిగలకూడదని అన్నారు. భద్రాచలం ఏజెన్సీ నుండే కాక ఛత్తీస్ఘడ్, ఒరిస్సా, ములుగు జిల్లాలో నుండి కూడా అనేక మంది రోగులు సరైన సమయంలో సరైన వైద్యం అందక మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ప్రజలకు నాణ్యమైన వైద్య అందక మరణాలు సంభవించడం దారుణమన్నారు.
నూతనంగా ప్రారంభించిన కిమ్స్ వైద్యశాలలో అనుభవజ్ఞులైన వైద్యులు తోపాటు అన్ని రకాల పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పోదాం వీరయ్య, మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, పట్టణ ప్రముఖులు వైద్యులు, హాస్పటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.