Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల
నవతెలంగాణ-బూర్గంపాడు
పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న ప్రభుత్వ హామీని తక్షణమే అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు తక్షణమే ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం బూర్గంపాడు మండల పరిధిలోగల సారపాకలో పార్టీ కార్యాలయంలో సారపాక గాంధీనగర్ శాఖ సమావేశం సిహెచ్ రమణయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇస్తానని చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నదని ఆయన అన్నారు. అది నమ్మి గిరిజనులు పోడు భూములకు పట్టలకోసం దరఖాస్తు అధికారులకు అందజేశారని, ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకూ వాటి ఊసే గాని వాటి ఆలోచన గాని ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ఫారెస్ట్, పోలీసు అధికా రులు గిరిజనులపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు కొని తినలేని విధంగా నిత్యావసర సరుకులు ధరలు భారీగా పెంచుతుందని ఆయన విమర్శించారు. ఉపాధి లేక అనేకమంది ప్రజలు ఇబ్బందులకు గురవు తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు యాల్లంకి అప్పారావు, శీను, ఆదూరి నరసిం హారావు, తదితరులు పాల్గొన్నారు.