Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్వారావుపేటలో మొక్కలు పెంపకం
- రైతుకు రొక్కం రాష్ట్రానికి చమురు భాండాగారం
- తెలంగాణకు పామ్ ఆయిల్ సాగు మ(నీ)ణిహారం
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్ ఫాం నూనె రూపంలో భారతదేశంలో తలసరి వినియోగం 10 కిలో గ్రాములు, కానీ పాశ్చాత్య దేశాలలో దీని వినియోగం 20 కిలోగ్రాములు లేక లీటర్లు. దీనిని అధిగమించాలంటే ఇతర నూనె పంటల కన్నా నాలుగు రెట్లు దిగుబడి ఇచ్చే ఆయిల్ ఫాం పంటను ప్రోత్సహించాల్సిన అవసరం వున్నది. కావున తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ పంట విస్తరణ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి గాను ఆయిల్‌ఫెడ్ తెలంగాణలో ఈ ఏడాది 80 వేల ఎకరాలలో పంట వేయించడానికి సన్నద్ధమైంది. దీనికి సంబంధించి ఆయిల్ ఫాం మొలకెత్తిన విత్తనాలను, మలేషియా, ఇండోనేషియా, కోస్టారికా, ధైయిలాండ్ మొదలైన దేశాలనుండి రూ.60లు నుండి రూ.70లు కొనుగోలు చేసుకుని దిగుమతి చేసుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిగా ఖమ్మం జిల్లా, దమ్మపేట మండలం, మల్కారంలో 1993 సంవత్స రంలో పామ్ ఆయిల్ సాగు ప్రారంభించారు.
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 35 వేల ఎకరాల్లో సాగులో ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రధమ స్థానంలో ఉన్నది. దీనికి గాను ఈ సంవత్సరం పెద్ద ఎత్తున కేంద్రీయ ఆయిల్ ఫాం నర్సరీను గత 5-6 నెలల్లో 3-4 కొత్త షేడ్ నెట్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ షేడ్ నెట్లలో 3 నెలలు పాటు మొలకలకు సరియగు తేమ, చీడ పీడలు నుండి రక్షణ కల్పించ బడుతుంది. 16 ఎకరాలలో కొత్తగా నర్సరీ కోసం అభివృద్ధి చేసారు. ఈ నర్సరీలో పెంచే మొక్కలకు కొత్త పద్ధతిలో నీరు అందించె బిందు సేద్యం పరికరాలు అమర్చారు. సమీకృత చీడపీడల నివారణ కోసం పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్ శాస్త్రవేత్తలు మార్గ దర్శకాలు ప్రకారం 12 నెలలు పాటు నర్సరీలో ఆయిల్ పాకు మొక్కలను సాంకేతిక నిపుణులు, ఉద్యాన అధికారుల సమక్షంలో ఎప్పటికపుడు మొక్కలను పరిశీలిస్తూ పెంచడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 12 లక్షల మొక్కలను వివిధ దశలలో పెంచడం జరుగుతుంది. అంతే కాకుండా ఈ ప్రాంతంలో రైతు పండించిన నాణ్యమైన పామ్ ఆయిల్ గెలలు ఎఫ్‌ఎఫ్‌బీ-ఫ్రెస్ ఫ్రూట్ బంచ్ పంటను కొనుగోలు చేయడానికి అశ్వారావుపేట గల గంటకు 30 టన్నులు సామర్ధ్యం, అప్పారావు పేటలో గంటకు 45 టన్నుల సామర్ధ్యం గెలలను ముడి చమురుగా తయారు చేసే ఆయిల్ ఫెడ్ కర్మాగారాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఇందులో 19.2 శాతం ఓఈఆర్ (ఆయిల్ రికవరీ) సాధిస్తూ దేశంలోనే అత్యధికంగా నూనె తయారీ చేయడం జరుగుతుంది.
పంట ముఖ్యమైన లాభాలు
దళారీ వ్యవస్థ లేదు, గెలలను(పంటను) నేరుగా ఫ్యాక్టరీలోకి రవాణా చేయడం. మూడు రోజులలో పంట మొక్క సొమ్మును రైతు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయటం. తక్కువ చీడపీడలు మొక్క, ఎరువులు, డ్రిప్ పరికరాలుపై నాలుగేండ్లు రైతుకు రాయితీ. జూన్‌లో టన్ను గెలలు ధర రూ.23467లు. పామ్ ఆయిల్ పంట ప్రారంభం నేటి వరకు ఇదే అత్యధిక ధర. మహిళా రైతులు, సన్నకారు, చిన్నకారు రైతులు కూడా సులభంగా సాగు చేసుకోవచ్చు.
- ఏడీహెచ్ ఉదరు కుమార్