Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను జిల్లాలో గల ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా అన్నారు. ఆదివారం ొత్తగూడెంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో యాకూబ్ పాషా మాట్లాడుతూ...సయ్యద్, పఠాన్, షేక్, మొహమ్మద్‌కు చెందిన ముస్లింలు అందరు ఈడబ్ల్యూఎస్ 10 శాతం పొందుటకు అర్హులని పేర్కొన్నారు. షేక్, మొహమ్మద్ వర్గాలకు చెందిన ముస్లింలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గల విద్యా, ఉద్యోగ అవకాశాలల్లో బీసీ-ఈ సర్టిఫికెట్ల ద్వారా 4 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల విద్యా-ఉద్యోగ అవకాశాలల్లో 10 శాతం రిజర్వేషన్ పొందుటకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు దోహద పడతాయని సూచించారు. అదే విధంగా సయ్యద్, పఠాన్ వర్గాలకు చెందిన ముస్లింలకు బీసీ-ఈ 4 శాతం రిజర్వేషన్లు లేని కారణంగా, వీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల విద్య-ఉద్యోగ అవకాశాలు పొందుటకు అర్హులని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పట్ల అధికారులు అవగాహన కల్పించని కారణంగా, జిల్లాలో అనేక మంది ముస్లింలు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో గల విద్య - ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్ర-రాష్ట్ర పరిధిలో గల పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అవుతున్నందున ముస్లింలు మీసేవ కేంద్రాల ద్వారా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లను పొందటానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర సమాచారం కోసం 8520860785ను సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో మైనారిటీ జిల్లా నాయకులు హుస్సేన్ ఖాన్, హఫీజ్, షకీల్, అసిఫ్ పాల్గొన్నారు.