Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మత్తు పదార్థాలు,మాదక ద్రవ్యాలతో యువత,విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖమ్మం రూరల్ ఏసిపి బస్వారెడ్డి తెలిపారు.పెద్దతండా వద్ద గల ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం యాంటీ డ్రగ్స్ డే ను పురస్కరించుకొని మత్తు పదార్థాలు- అనర్ధాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు.ఈ సదస్సులో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై జక్కుల శంకర్రావు, కళాశాల కరస్పాండెంట్ కాటేపల్లి నవీన్ బాబు, ప్రిన్సిపాల్ బీ.గోపాల్, వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : మత్తుకు బానిసై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవొద్దని సత్తుపల్లి ఏసీపీ ఎన్.వెంకటేశ్ సూచించారు. ప్రపంచ యాంటీ డ్రగ్స్ డేను పురస్కరించుకుని ఖమ్మం సీపీ ఆదేశాల మేరకు సత్తుపల్లి పోలీసుశాఖ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణమంతా సైకిల్‌పై ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక రింగ్ సెంటర్ వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు వారిలో మార్పులను పసిగడుతూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పధార్ధాలు వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్, ఎస్ఐ ఎస్కే షాకీర్, ఎక్సైజ్ సీఐ, సిబ్బంది పాల్గొన్నారు.
ముదిగొండ : మాదక ద్రవ్యాలకు (డ్రగ్స్) దూరంగా ఉండాలంటూ ఎస్సై తోట నాగరాజు అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మంరూరల్ సిఐ ఎం.శ్రీనివాస్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముదిగొండలో పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన సెంటర్ వరకు ఆదివారం మాదక ద్రవ్యాల నిషేధ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకొని మాదకద్ర వ్యాలను నిర్మూలించాలన్నారు. మాదకద్రవ్యాల గురించి ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వైరా : డ్రగ్స్, గంజాయి, వంటి మత్తు పదార్థాలు యువశక్తి ని నిర్వీర్యం చేస్తున్నాయని, డ్రగ్స్ వాడకం ప్రాణాంతకం అని కూడా వైరా ఎసిపి సాధనా రష్మీకా పెరుమాల్ అన్నారు. నియోజకవర్గం కేంద్రం వైరాలో ఆదివారం అంతర్జాతీయ డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ఆమె పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పాత బస్టాండ్ నుండి రింగ్ రోడ్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డివిజనల్ పోలీసులు, విద్యార్థులు, యువత, పౌరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఐ సురేష్ ఎస్ఐలు ఎస్వీర ప్రసాద్, యాయతి రాజు, ఎంకన్నతో పాటు వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.