Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
మండల పరిధిలోని మూకమామిడికి చెందిన మేడేపల్లి అచ్చయ్యచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కార్పెంటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్మోహనచారి, జిల్లా అధ్యక్షులు కాపర్తి వెంకటాచారి, ఉపాధ్యక్షులు జుజ్జూరి ప్రభాకరాచారిలు బాధితుని నివాసానికి వెళ్లి రూ.12,500 ఆర్ధికసాయం అందజేశారు. అచ్చయ్య చారిది నిరుపేద కుటుంబం కావడంతో కార్పెంటర్ల సహకారంతో ఈ సహాయం అందించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణచారి, ప్రధాన కార్యదర్శి కాసర్ల రామారావు, మండల అధ్యక్షులు మద్దోజు గంగాధరచారి, ఉపాధ్యక్షులు ఆరుధ్ర లక్ష్మణచారి తదితరులు పాల్గొన్నారు.