Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-చింతకాని
నేడు ప్రపంచీకరణ యుగంలో యువత పెడదారులకు కొట్టుకుపోతున్నారని, అలాంటి యువత సామాజిక కార్యక్రమాల్లో ముందు నిలబడాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు గత మూడు రోజులుగా కొదుమూరు గ్రామంలో జ్యోతి ఫంక్షన్ హాల్లో జరుగుతున్నవి. ఆఖరి రోజు ముగింపు సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ పాల్గొని మాట్లాడుతూ యువత సెల్ ఫోన్, టీవీ, సినిమాలు చూడడానికి పరిమితం అవుతున్నారని, ఆ మార్గం వైపు కాకుండా సమాజ సేవకు, సామాజిక కార్యక్రమాల వైపు మళ్ళించే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి, సమాజంలో బాధపడుతున్నవారికి సేవా కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా నడిపించే దానిలో డివైఎఫ్ఐ ముఖ్య భూమిక పోషించాలని, యువత ముందుకు వస్తేనే ఇలాంటి కార్యక్రమాలు జయప్రదం అవుతాయని ఆయన అన్నారు.
సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, అడగండి వెంకటేష్, డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, సిఐటియు నాయకులు మడుపల్లి గోపాల్రావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వత్సవాయి జానకిరాములు, రాము, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్, జిల్లా కమిటీ సభ్యులు సత్తెనపల్లి నరేష్, గుమ్మ ముత్తారావు, చింతల రమేష్, భూక్య ఉపేందర్ నాయక్, రోషిని కాన్, కూరపాటి శ్రీను, దిండు మంగపతి, శీలం వీరబాబు, గడ్డం విజరు, భయ్యా బాలాజీ, నవీన్, వీరబాబు, సుజాత, రజని తదితరులు పాల్గొన్నారు.