Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటు సభ్యులు నామ విమర్శ
- మండలంలో పలువురికి పరామర్శలు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, కార్మిక, కర్షక, యువత, ఆశలకు తిలోదకాలిస్తూ ప్రజలపై పెను భారాలు మోపుతోందని అగ్నిపథ్‌పై యువత తిరుగుబాటు చేస్తుందని దాన్ని రద్దు చేయాలని ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులు లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. తొలుత తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఖమ్మం జిల్లా ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తాతా మధు సూదన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రైతు బంధు జిల్లా కమిటీ కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, గ్రానైట్ అధిపతి తుళ్లూరు కోటేశ్వరరావు, స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి జగన్ మోహన్ రావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అనం తరం ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలో సంవత్సరం క్రితం మృతి చెందిన గ్రామ అభివృద్ధికి కృషి చేసిన విశ్రాంత ఉద్యోగి బుర్ర సుబ్బారావు విగ్రహ ఆవిష్కరణ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు సుబ్బారావు చేసిన సేవలను కొని యాడారు.మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో నామా నాగేశ్వర రావు మాట్లాడారు. అనంతరం ఎర్రుపాలెం ఎంపీటీసీ సభ్యులు షేక్ మస్తాన్ వలీ తల్లిని పరామర్శించారు.పెగల్లపాడు ఎంపీటీసీ సభ్యులు సగుర్తి కిషోర్ బాబును పరా మర్శించారు. పెద్ద గోపవరం, అయ్యవారిగూడెం, మండలంలోని వివిధ గ్రామాల్లో పలువురుని పరామర్శించి పలకరించారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ శిరీష, జెడ్పిటిసి కవిత, గ్రామ పంచాయితీ సర్పంచులు మూల్పూరి స్వప్న, పురుషోత్తమ రాజు, కొమ్మూరి గోపాలరావు, మొగిలి అప్పారావు, కోట శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షులు మూల్పూరి శ్రీనివాసరావు, మధు సూదన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పం బి.సాంబశివరావు, నాయకులు కొండెపాటి సాంబశివరావు, సామినేని రామారావు, మహిళా మండలి అధ్యక్షురాలు ఉమా మహేశ్వరి, బుర్ర సుబ్బారావు కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.