Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెజికెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి రమణ
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లాలో కల్లుగీత కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలని కెజికెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలోని మంచికటి భవనంలో కెజికెఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, గాలి అంజయ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్లాసులు నిర్వహించారు. ఈ క్లాసులలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి రమణ మాట్లాడుతూ, జిల్లాలో 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు గత నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్‌లో పెట్టిన పెన్షన్ వెంటనే ఇవ్వాలని, వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా వెంటనే ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు వెంటనే ఇవ్వాలని, టాడి కార్పొరేషన్‌కు కేటాయించిన బడ్జెట్ వెంటనే విడుదల చేసి గీత కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని అన్నారు.గీత కార్మికుల ఉపాధి కోసం కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున గీతన్న బందు ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో తాటి,ఈత చెట్లు నరికిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, ప్రతి సొసైటీకి కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని, హరితహారంలో తాటి, ఈత, ఖర్జూర, జిలుగు చెట్లను నాటాలని, కోటి వరాల కార్యక్రమంలో ఇచ్చిన గీత కార్మికుల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు సొసైటీ పేరు మీద ఇవ్వాలని, అలాగే మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కొండా కరుణాకర్, భయ్యా సోమన్న, కందిమల్ల తిరుపతి, పరికపల్లి బ్రహ్మం, మోటపోతుల వెంకన్న, బోల్లికొండ పాపయ్య, మొక్క నాగేశ్వరరావు, మోటపోతుల వెంకటేశ్వర్లు, మరికంటి శ్రీనివాసరావు, వెంకన్న, రెడ్డి మల్ల వెంకటయ్య, జలగం వెంకట్రావు, ఎడవల్లి ప్రసన్న, పులుసు అశోక్, కసాని రమేష్, పొట్లపల్లి లక్ష్మయ్య, బజార్ రమేష్, సొంటి వెంకటేశ్వర్లు, సేవగాని ఉపేందర్, మంద నాగేశ్వరరావు, ఆలూరి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.