Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
మండల కేంద్రంలో నిర్మాణం తుది దశకు చేరుకున్న 36 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, వాటి పక్కనే ఉన్న ఖాళీ స్థలాలను కూడా మంగళవారం తెల్ల వారు జామున గ్రామస్తులు ఆక్రమించుకున్నారు. కాగా అందులో కొంతమంది లబ్దిదారులను కూసుమంచి గ్రామసభలో రెండు సంవత్సరాల క్రితం ప్రకటించగా నేటికీ లబ్దిదారులకు ఇండ్లను అప్పగించకపోవడంతో విసుగు చెందిన లబ్దిదారులు ఆక్రమించుకున్నారు. మధ్యాహ్నం రెవెన్యూ అధికారులు ఆర్ఐ సుధీర్, సర్వేయర్ రవి, విఆర్ఏలు రమేష్, రవి తదితర అధికారులు ఇండ్లను ఆక్రమించుకున్న వారు ఇండ్లు ఖాళీ చేయాలనీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లలో పూర్తి సౌకర్యాలు కల్పించి ఒక వారం రోజుల్లో గతంలో గ్రామసభ లో ప్రకటించిన లబ్దిదారుల జాబితాలో ఉన్న వారికి డ్రా పద్దతి ద్వారా ఇంటి నంబర్లు కేటాయిస్తామని అప్పటి వరకు ఆక్రమించుకున్న వారంతా ఇండ్లు ఖాళీ చేసి వెళ్లాలని అదేశించారు. ఒక వేళ ఖాళీ చేయకపోతే పోలీస్ వారి సహాయంతో ఇండ్లు ఖాళీ చేపిస్తామని తెలిపారు.