Authorization
Wed April 16, 2025 02:21:36 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'' 136 ఏళ్ల క్రితం మే 1వ తేదీన అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం చికాగో నగరంలో 18 గంటల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలెత్తి తిరగబడిన ప్రాంతం. ''ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. పోరాడితే పోయేది ఏమీలేదు బానిస సంకెళ్లు తప్ప'' అంటూ కారల్ మార్క్స్- ఎంగెల్స్ -కమ్యూనిస్టు ప్రణాళిక ఇచ్చిన పిలుపునకు స్పందించిన నేల... పెట్టుబడిదారుల తుపాకుల తూటాలకు గుండెలెదురొడ్డిన శ్రామిక వీరుల రక్తంతో తడిసిన చొక్కాలు అరుణ పతాకాలై లేచిన చోటు... మార్క్సిస్టు మహనీయుల ఆశయాల పతాక ఎర్రజెండాకు జన్మనిచ్చి... ప్రపంచానికి అందించిన నగరంలో పర్యటించి... ఆ పోరాట చిహ్నాలను దర్శించి... మేడే అమర వీరులకు నివాళులు అర్పించిన సందర్బం చిరస్మరణీయం'' అని కుటుంబ సమేతంగా తన అమెరికా పర్యటన స్మృతులను సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యకర్తలతో మంగళవారం పంచుకున్నారు. ఆ దృశ్యాలు 'నవతెలంగాణ' పాఠకుల కోసం...