Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యతను విస్మరిస్తున్న బీజేపీ ప్రభుత్వం
- కారేపల్లిలో మంత్రి పువ్వాడ అజరుకుమార్
నవతెలంగాణ-కారేపల్లి
ప్రభుత్వ బడుల ముఖచిత్రంను ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో నూతనంగా నిర్మించిన జూనియర్ కళాశాల ఆకడమిక్ బ్లాక్‌ను వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి మంత్రి ప్రారంభిం చారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ బిడ్డల చదువు తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో 983 గురుకులాలను అన్ని వసతులతో ఏర్పాటు చేశారన్నారు. తల్లిదండ్రుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో అంగ్లమాద్యంను ఫ్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత మరిచి ప్రవరిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావల్సిన కోత పెట్టటమే కాకుండా విద్యాభారంను రాష్ట్రాలపై మోపిందన్నారు. తెలంగాణ మోడల్, ఏకలవ్య మోడల్ స్కూళ్ల భారం రాష్ట్రమే భరిస్తుందన్నారు. మహిళలకు సమాన అవకాశాల ద్వారానే సాధికారిత సాధ్యమన్నారు. పార్లమెంట్లో పార్టీలు మారుతున్న మహిళలకు 33 శాతం రిజర్వేషను బిల్లు అమోదం పొందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల రిజర్వేషన్ బిల్లును శాసన సభలో ఆమోదించి పంపినా కేంద్రంలో దానిపై తొక్కిపెట్టిందని ఆరోపించారు.
మంత్రి దిశానిర్ధేశంలో పయనం
జిల్లా మంత్రి పువ్వాడ అజరుకుమార్ దిశానిర్దేశంలో పయనిస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. కారేపల్లి కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు తరగతి గదుల ప్రారంభం సందర్బంగా జరిగిన సభకు ఎమ్మెల్యే అధ్యక్షవహించారు. అనంతరం విద్యాలయంలో మంత్రి, ఎమ్మెల్యేలు మొక్కలను నాటారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, డీఈవో యాదయ్య, ఆర్డీవో రవీంద్రనాధ్, డీఆర్డీఏ పీడీ విద్యాచందన, టీఎస్ఈడబ్ల్యూఎంఐసీ ఈఈ నాగశేషు, ఆర్ అండ్ బీ ఈఈ శ్యామ్‌ప్రసాద్, జీసీడీవో ఉదయశ్రీ, డీఎల్పీవో పుల్లారావు, తహసీల్ధార్ కోట రవికుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎస్వో ఝాన్సీసౌజన్య, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, ఆర్టీఏ జిల్లా సభ్యులు వల్లభినేని రామారావు, సోసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, రైతుబంధు కన్వీనర్ గుగులోత్ శ్రీను, టీఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధానకార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, మాలోత్ కిషోర్, బానోత్ కుమార్, మొగిలి ఆదినారాయణ, అజ్మీర నాగేశ్వరరావు, ఎంపీటీసీ ఇమ్మడి రమాదేవి, పెద్దబోయిన ఉమాశంకర్, సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు పాల్గొన్నారు.