Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొణిజర్ల: మండల పరిధిలోని లాలాపురం గ్రామంలో 419 సర్వే నెంబర్లో ఆక్రమంగా నిర్మించిన చెరువు నిర్మాణాలను మంగళవారం ఐబి డీఈ ఫిషరీస్ ఎప్డీవో రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఐబిడీఈ గౌతమి శిల్పా మాట్లాడుతూ మొత్తం చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది. అదేవిధంగా ఎప్టిఎల్ ఎంత ఉంది అనేది గుర్తిస్తామని ఆమె తెలిపారు. ఇక్కడ చెరువు ఉన్నమాట వాస్తవమేనని రెవెన్యూ అధికారులు తప్పిదం మూలంగా చెరువుకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం వలన సంబంధిత వ్యక్తి ఫిషరిస్ ఐబి శాఖల నుంచి చెరువు నిర్మాణ పనులకు అనుమతులు తీసుకున్నట్లు వెల్లడించారు. అధికారులు వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక రైతులు సంక్రాంతి నర్సయ్య చింతనిప్పు చలపతిరావు రమేష్‌లు మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన వ్యక్తికి ప్రభుత్వానికి చెందిన చెరువుకి ఎలా ఇచ్చారని పాస్ బుక్‌లు ఇచ్చారని ప్రశ్నించారు. సంవత్సరం కాలంగా చెరువు పనులు చేస్తున్న అధికారులకు ఫిర్యాదు చేసిన సరిగ్గా స్పందిచకపోవడం వలనే ఇదంతా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ బుక్ లు రద్దు చేసి చెరువు ఆక్రమంగా నిర్మించినట్లు తామకు అధికారులు పత్రాలు చూపించి దగ్గర ఉండి చెరువుని ధ్వంస్వం చేసి యదావిధిగా రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫిషరిస్ ఎఫ్డివో మాట్లాడుతూ తాను విధుల్లోకి వచ్చి రెండు నెలలు మాత్రమే అవుతుందని తెలిపారు. అదేవిధంగా విషయాన్ని తహశీల్దార్ దృష్టి కి తీసుకోని వెళతానని ఆర్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐబిఏఈ మనోజ రైతులు పాల్గొన్నారు.