Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దిన్
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
కల్తీ పదార్థాలు, స్టాక్ ఉన్న కూడా జ్యూస్ అమ్ముతున్న పోలాస్ జ్యూస్ పాయింట్‌పై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దిన్ డిమాండ్ చేశారు. స్థానిక వన్ టౌన్ ప్రాంతంలో బొమ్మన సెంటర్ లో ఉన్న జ్యూస్ పాయింట్ లో కల్తీ పదార్థాలు మరియు స్టాక్ ఉన్న జ్యూస్ అమ్ముతున్నారని డివైఎఫ్ఐ ఖమ్మం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ. కల్తీ పదార్థాలు, స్టాక్ ఉన్న జ్యూస్ అమ్ముతున్న వాటిని పరీక్షలు నిర్వహించి పోలాస్ పాయింట్ పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్.బషీరుద్దీన్ మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో నాలుగైదు బ్రాంచీలుగా నడుపుతూ నగరంలోని అత్యంత ఎక్కువ రేట్లకి పోలాస్ జ్యూస్ పాయింట్లు కల్తీ పదార్థాలు అమ్ముతూ, స్టాక్ ఉన్న జ్యూస్ అమ్ముతున్నారని, కస్టమర్లు ఏమిటి అని అడిగితే మేము ఇలాగే అమ్ముతాం ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండని బెదిరిస్తున్నారని, తెలిపారు. పోలాస్ జ్యూస్ పాయింట్ పై తక్షణం చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షంగా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి ఉంటుందని డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వన్ టౌన్ కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, వన్ టౌన్ అధ్యక్షులు రావులపాటి నాగరాజు, నాయకులు సంతోష్ రెడ్డి, శ్యామ్, తరుణ్, రహిమాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.