Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బురద మయమైన ప్రధాన కార్యాలయాలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
నియోజక వర్గ కేంద్రం. మిగతా మండలాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన మండల కేంద్రం. అయినా ఏ కార్యాలయం ప్రాంగణం చూసినా బురదమయం. వర్షాకాలానికి ముందే ప్రభుత్వం పల్లె ప్రగతి పధకం పేరుతో ప్రధాన అంశంగా పారిశుధ్యం నిర్వహణతో వారం కార్యాచరణ చేపట్టింది. ఇందులో నీటి నిల్వ ప్రదేశాలు, ప్రాంతాలు, స్థలాలు, గుంతలు గుర్తించడం, వాటిని చదును చేయడం, నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతీ రోజు కార్యాచరణ నివేదిక ఉన్నతాధికారులకు అందజేశారు. అయినా ఆచరణ మాత్రం ప్రశ్నార్ధకం. ఈ చిత్రాల్లో కనిపించేవి ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్న కార్యాలయాలు కాదు. నియోజక వర్గం కేంద్రంలో ప్రధాన కార్యాలయాలు దుస్తితి. అన్నం ఉడికిందో లేదో తెలియడాని ఒక మెతుకు పట్టి చూస్తే చాలు. అలాగే నియోజక వర్గం కేంద్రంలో పారిశుధ్యం ఎలా ఉందో చెప్పడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చాలు. ఈ క్యాంపు కార్యాలయానికి ఇటీవలే సిమెంట్ రోడ్డు నిర్మించారు. ప్రధాన రహదారికి ఆ మార్గం కొలిచే చోటు మట్టితో నింపడంతో బురద మయం అయింది. అంతే కాదు ఈ క్యాంపు కార్యాలయం ముఖద్వారం దగ్గరే నీళ్ళు నిలిచి ఉండటం ఒక రకంగా ఎబ్బెట్టు కలిగించే విషయమే. మండల పరిషత్ పూర్వ కార్యాలయం ప్రాంగణంలో శ్రీ శక్తి భవన్, ఉద్యాన వనరుల కేంద్రం, ఐటీడీఏ డివిజనల్ కార్యాలయాలు ఉన్నవి. ఈ కార్యాలయాల్లోకి వెళ్ళాలంటే బురదలో కాలు వేయాల్సిందే. ఎమ్మెల్యే కార్యాలయంతో సహా ఈ కార్యాలయాలు అన్నీ రద్దీగా ఉండి బురద మయం అయి ఉంటే నిజమే అనుకోవచ్చు. కానీ ఎమ్మెల్యే అధికారిక మో లేక తెరాస కార్యక్రమం ఉంటే తప్ప కార్యాలయం వంక చూడరు. ఐటీడీఏ కార్యాలయం అంతే రద్దీగా ఉండదు. ఎందుకంటే ఆ అధికారులు కార్యాలయానికి ఎపుడు వస్తారో, ఎపుడు వెళ్తారో కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికీ తలియదు. ఇక ఉద్యాన అధికారి ఎవరో కూడా తెలియని పరిస్తితి. స్త్రీ శక్తి భవన్ స్వయం సహాయక సభ్యులు, సిబ్బందితో కొంచెం రద్దీగా ఉన్నప్పటికీ ఈ కార్యాలయంలోకి వెళ్ళాలంటే చిన్నపాటి కాలువ దాటాల్సిందే. ఇది పారిశుధ్యం దుస్తితి.