Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులున్నా రైతుల ఖాతాల్లో రైతుబంధు
- ఈనెల 11న బండి, వద్దిరాజు అభినందన సభ
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
దేశ వ్యాప్తంగా ఒక్క తెలంగాణలోనే కనీవినీ అభివృద్ధి జరుగుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. మంగళశారం స్థానిక క్యాంపు కార్యాల యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన సభలో సండ్ర మాట్లాడారు. ఆర్థిక పరంగా ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమాభివృద్ధి పథకాలు ఆగడం లేదన్నారు. రైతుబంధు సాయం కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. కొద్ది రోజుల్లోనే ధరణి సమస్యలు పరిష్కారం మాదిరిగానే రైతుల రెవెన్యూ సమస్య లను కూడా ఎక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబో తోందన్నారు. దీంతో పాటు ఇండ్ల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పక్క రాష్ట్రాల ప్రజలు గమనించడమే గాక మన రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలోనే కలపాలని అక్కడి గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయంటే ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థచేసుకోవచ్చన్నారు. అంతకు పాలన ఎలా ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాÊ ఎలా ఉందనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమా లను గ్రామగ్రామాన టీఆర్ఎస్ శ్రేణులు తిరుగతూ ప్రజలకు అర్థమయ్యేలా తెలియ జేయాల న్నారు. అనంతరం రూ. 14.53లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధి దారులకు అందించారు. కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మండల, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, ఎస్కే రఫీ, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి ఇతర మండలాల నాయకులు పాల్గొన్నారు.
ఈనెల 11న సత్తుపల్లిలో బండి, వద్దిరాజు అభినందన సభ....
ఇటీవల కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన మన జిల్లాకు చెందిన బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర అభినందన సభ ఈనెల 11న సత్తుపల్లిలో జరుగుతుందని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ఈ సభ విజయవంతానికి సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు అత్యధిక సంఖ్యలో జన సమీకరణ చేయాలన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భారీ మోటారుసైకిలు ర్యాలీ ఉంటుందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అభినందన సభను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.