Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ నీరజకు వినతి
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ స్థానికుల విజ్ఞప్తి మేరకు టేకులపల్లి, లక్ష్మీనగర్ పరిసర ప్రాంతాలలో పందుల బెడద ఎక్కువగా ఉన్నందున వాటి వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీధులలో ఇళ్ల మధ్యలో అధిక సంఖ్యలో పందులు సంచరించడం వలన సీజనల్ వ్యాధులు, మెదడు వాపు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, పందుల బెడదపై చర్య తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు. మంగళవారం ఖమ్మం నగరపురపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ నీరజ చాంబర్ నందు ఏడవ డివిజన్ స్థానికులు కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో పందుల పెంపకం దారులకు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. కానీ వారు అక్కడకు వెళ్లకుండా ఇళ్ళ మధ్యలోనే పెంపకం చేయటం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు.