Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి క్వార్టర్లు కాజేస్తున్న ప్రభుత్వం
- రిటైర్డ్ కార్మికులకే ఇవ్వాలి
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద
నవతెలంగాణ-ఇల్లందు
గత గుర్తింపు సంఘం ఎన్నికలలో కార్మికులకు సొంత ఇంటి పథకం, బినామీ పేర్లు సరి చేస్తామని సీఎం కేసీఆర్ వాగ్దానం చేసి పదేండ్లు కావస్తున్నా నేటికీ అమలుకు నోచుకోలేదని తక్షణం అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్ చేశారు. స్థానిక జెకేఓసీ మైనింగ్‌లో మంగళవారం ఫిట్మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో రూ.50 వేల బేసిక్ ఉన్న కార్మికులు క్వార్టర్లు తీసుకుంటే యాజమాన్యం ఇచ్చే తొమ్మిది శాతం కింద రూ.4,500 కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. వేతనంపై ఇన్‌కంటాక్స్ 7.5శాతం కోత విధిస్తున్నారని అన్నారు. క్వార్టర్లు తీసుకోవడం వల్ల కార్మికుడు ర.లక్షకు పైగా కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. సర్వీసులో రూ.30 లక్షల దాకా ఖర్చు అవుతుందని అన్నారు. కార్మికుల పిల్లల చదువులు పెళ్లిళ్లు ఇతర ఖర్చులు ఫోను దిగిపోయిన తర్వాత కంపెనీ ఇచ్చే రూపాయలు సొంత ఇల్లు కట్టుకోడానికి కూడా సరిపోవడం లేదని అన్నారు. సింగరేణి ఏరియాలో ఉన్న కోటర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉన్నతాదికారులకు కేటాయిస్తు న్నారని ఈ రకంగా ప్రభుత్వపరంగా వారికే కేటా యింపులు చేస్తున్నారని అన్నారు. రిటైర్మెంటు కార్మికులు ఇల్లు లేక అవస్థలు పడుతున్నారని, ఖాళీగా ఉన్న కోటర్లు వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుడు తన సర్వీసులో రక్తాన్ని చెమటను దారపోసి కంపెనీ అభివృద్ధికే శ్రమించాడని అన్నారు. వారి శ్రమకు తగ్గట్లుగా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కూకట్ల శంకర్, ఇల్లందు బ్రాంచ్ అధ్యక్షులు ఎండి అబ్బాస్, ఉపాధ్యక్షులు శివరాజ్ పాషా, సహాయ కార్యదర్శి సదానందం, సీనియర్ నేతలు విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.