Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
పాఠశాలల యాజమాన్యాలు విద్యా భోదనతో పాటు స్వచ్చతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రశంశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో విద్యాశాఖ అద్వర్యంలో నిర్వహించిన స్వచ్చ విద్యాలయ పురస్కార్ 2021-22 జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన కలెక్టర్ స్వచ్చ విద్యాలయ పురస్కారాలు సాధించిన ఉపాద్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పాటించడంలో సమర్ధతను గుర్తిచేందుకు స్వచ్చ విద్యాలయ పురస్కార్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పర్యవేక్షణ టీములు పాఠశాలలను సందర్శన ధృవీకరణలో భాగంగా నీరు, పారిశుద్యం, సబ్బుతో చేతులు కడుక్కోవడం, యాజమాన్య పద్ధతులు, నిర్వహణ, పిల్లల ప్రవర్తనలో మార్పు, సామర్ధ్యాల పెంపుదల, కోవిడ్ 19 సంసిద్ధత, ప్రతి స్పందన వంటి ఆరు అంశాలలో 59 ప్రశ్నలు తయారు చేసి పాఠశాలల సమర్ధతను పరిశీలించి ఎస్విపి పోర్టల్లో అప్లోడ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 1733 పాఠశాలల్లో 1672పాఠశాలల ప్రధానోపాద్యాయులు ఎసిపి పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రదానోపాద్యాయుల స్వీయ మూల్యాంకన ప్రక్రియ ద్వారా 5 స్టార్లలో 59 పాఠశాలలు, 4 స్టార్లలో 361 పాఠశాలలు, 3 స్టార్లలో 759 పాఠశాలలు రాగా మిగిలిన 493 పాఠశాలలు 1, 2 స్థానానల్లో గుర్తించబడినట్లు చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం 31మార్చి 2022 వరకు జరిగినట్లు చెప్పారు. వీటి నుండి 14 పాఠశాలలు రాష్ట్ర స్థాయికి నామినేట్ అయినట్లు చెప్పారు. అవార్డులు సాధించి ఇతర పాఠశాలలు సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అవార్డులు సాధనలో భాగస్వాములైన యంఈఓలను, ఉపాధ్యాయులను, సిఆర్పిలను కలెక్టర్ అభినందించారు. అనంతరం స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాద్యాయులను కలెక్టర్ శాలువా, మెమెంటో, ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించా రు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఏడి రామారావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.దయానందస్వామి, స్వచ్ఛ విద్యాలయ పురస్కారాల నోడల్ అధికారి సైదులు, కో-ఆర్డినేటర్లు నాగరాజ శేఖర్, అన్నామణి, మిషన్ బగీరథ ఈఈ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.