Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదావరిలోకి భారీగా చేరుతున్న వరద నీరు
- గండ్లు పడ్డ కాపర్ డ్యాం అ ఇంటి ముఖాలకు దారి పట్టిన కార్మికులు
- వర్షాకాలం వెళ్లేంతవరకు పనులకు బ్రేకే
నవతెలంగాణ-అశ్వాపురం
గోదావరి నదిపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న సీతమ్మరసాగర్ ప్రాజె క్టులోకి గోదావరి నీరు పెద్ద ఎత్తున చేరుకు ంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో మండల పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామ సమీపంలో గల గోదావరి నదిపై కాటన్ దొర నిర్మించిన ఆనకట్ట దిగువ భాగంలోని 200 మీటర్ల సమీపంలో నిర్మాణం చేపడుతున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు జలమయంగా మారింది. గోదావరి పెద్ద ఎత్తున రావడంతో సీతమ్మ సాగర్ కాపర్ డ్యాంకు అక్కడక్కడ గండ్లు పడ్డాయి. తుఫానుల కారణంగా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపడుతున్న భారీ యంత్రాలను ముందస్తుగానే ఒడ్డుకు చేర్చారు. ఇక ఈ పనులు చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు గోదావరి కారణంగా పనులకు బ్రేక్ పడడంతో వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఇంటిదారి పట్టారు. ఈ వర్షాకాలం ఇలానే కొనసాగితే మరో మూడు మాసాల పాటు పనులకు విరామం కలిగినట్లేనని, వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత మరల పనులు చేపట్టేందుకు సన్నక చర్యలు చేస్తున్నారు.