Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో పలువురు వక్తలు నివాళు
నవతెలంగాణ-కొత్తగూడెం
మల్లిఖార్జునరావు మరణం పలు ఉద్యమాలకు తీరని లోటని, కాంట్రాక్ట్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ, అనేక ఆందోళన నేపద్యంలో ప్రభుత్వం పర్మినెంట్ చేస్తున్న క్రమంలో ఆయన మృతి వారి కుటుంబానికి, సంఘానికి తీరని లోటని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం మండెల మల్లిఖార్జునరావు సంస్మరణ సభ స్ధానిక కొత్తగూడెం క్లబ్లో జరిగింది. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు అధ్యక్షతన జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యాక్షులు ఎం.సాయిబాబు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, కాంట్రాక్టు లెక్చరర్స్ రాష్ట్ర నాయకులు సురేష్‌కుమార్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీనియర్ నాయకులు కాసాని అయిలయ్య, టిఎస్‌యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి బి.కిషోర్‌సింగ్, ఎన్.కృష్ణ, యూటీఎఫ్ నాయకులు ఎస్.వెంకటేశ్వర్లు, పద్మారాణి, ఐద్వానాయకులరాలు ఎస్.లక్ష్మీ, సింగరేణి అధికారి ఎం.కనకయ్య. ఎం.రాజమల్లు, మాట్లాడారు. ముందుగా మల్లిఖార్జున్ చిత్ర పటానికి పూలమా వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మల్లిఖార్జున్ తను చేస్తున్న వృత్తి పరంగా ఎదురైన సమస్యల పరిష్కారంతో పాటు తన సతీమణి టీచర్‌గా పనిచేస్తు, ఉపాధ్యాయ సంఘంలో కీలక బాధ్యత నిర్వహిస్తున్న క్రమంలో ఆమెకు అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందించారని తెలిపారు. సీపీఐ(ఎం) సభ్యుడిగా ఉన్న ఆయన తన నివాస ప్రాంతలో ప్రజల సమస్యల గురించి స్పందించి, వాటి పరిష్కారం కోసం చేసి కృషిని ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేశారు. తన కుటుంబమే బాగుండాలని కోరుకునే వారు ఎందరో ఉంటారని, మల్లిఖార్జున్‌రావు సమాజలోని ప్రజలందరూ బాగుండాలని, అందులో మనముండాలని కోరున్న వ్యక్తి ఆని ఘననివాళులు అర్పించారు. వారి కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటామన్నారు. ఈ కారక్రమంలో ఉపాద్యాయ సంఘాల నాయులు డి.వెంకటేశ్వర్లు, సీపిఎం నాయకులు, విద్యార్ధి, యువజన, మహిళా సంఘం నాయకులు, వారి కుటంబ సభ్యులు పాల్గొన్నారు.