Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని మొగరాలగుప్ప గ్రామంలో వ్యకాస ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయన ముఖ్య అధితిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉండాలని, ఆస్పత్రులలో డాక్టర్ల కొరత లేకుండా చూసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని, ప్రజలకు దోమతెరలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ వేతనాలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రెవిన్యూ సభలలో పోడు దరఖాస్తులను పరిశీలించి వెంటనే పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోడు సాగుదారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదాల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ముదిగొండ రాంబాబు, మండల నిమ్మల మధు, కీసర వెంకట్రావ్,గడ్డం వెంకటేశ్వర్లు, పొట్ట రమేష్, కుంజా వెంకటేష్, పోడియం సీతారాములు, కీసరి గోపయ్య, కోర్సా బుచ్చమ్మ, గడ్డం రాములమ్మ, తానం రిక్కమ్మ, కాక భద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.