Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఎల్ఆర్ గాట్లో ఘన నివాళులు
- మెగా ఉచిత వైద్య శిబిరం
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోజులకు పాలు, పండ్లు పంపిణీ
- అనాథాశ్రమంలో ఉచిత అన్నదానం
నవతెలంగాణ-పాల్వంచ
విద్యా ప్రధాత కెఎల్ఆర్ విద్యాసంస్థల వ్యవస్థాప కులు డాక్టర్ కే.లక్ష్మారెడ్డి జయంతి సందర్భంగా కేఎల్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. అన్ని విద్యాసంస్థల్లో కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు బోధ నేతర సిబ్బంది విద్యార్థులు కేక్ కట్ చేసి ఘన నివాళులు అర్పించారు. విద్యా సంస్థల చైర్పర్సన్ కె.నాగమణి కుమారుడు సిద్ధార్థ మధుసూదన్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
కే.ఎల్.ఆర్.ఉచిత మెగా వైద్య శిబిరం
ప్రముఖ విద్యావేత్త దివంగత డాక్టర్ కే.లక్ష్మారెడ్డి జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని స్థానిక ఫార్మసీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని కొత్తగూడెం డి.సి.హెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, శ్యామల ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ నల్ల సురేష్ రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో ఖమ్మం కిమ్స్ ఆస్పత్రి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బిజేష్ నాయర్, ఎం.డి (కార్డియాలజిస్ట్), డాక్టర్ జి.మురళీమోహన్ రెడ్డి ఎం.డి (నెఫ్రాలజిస్ట్), డాక్టర్ జి.శ్రీ హరి రెడ్డి (రుమటాలజిస్ట్), డాక్టర్ జె.లోకేష్ కుమార్ (యూరా లజిస్ట్) ఉచిత మెగా వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు.
రోగులకు పాలు, పండ్లు, గుడ్లు, బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ
దివంగత డాక్టర్ కే.లక్ష్మారెడ్డి జయంతి సందర్భంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, గుడ్లు, బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. లక్ష్మారెడ్డి కుమారుడు సిద్ధార్థ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ముక్కంటి శ్వరరావు, కళాశాల డైరెక్టర్ మురళిప్రసాద్, కాశీ విశ్వనాథం, కే.ఎల్.ఆర్.జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహారావు, ఎం.ప్రసాద్ రెడ్డి, కేఎల్ఆర్ విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు.