Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ రఘునాథ్
నవతెలంగాణ-సుజాతనగర్
కాసాని లక్ష్మి వైద్య శిబిరం ద్వారా అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని ప్రముఖ డాక్టర్ రఘునాథ్ అన్నారు. సోమవారం మండల పరిధిలో కాసాని లక్ష్మి వైద్య శిబిరంలో సేవలందించడానికి విచ్చేసి మాట్లాడారు. నేటి సమాజంలో ప్రజలకు వైద్య సేవలు అందించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. ప్రతి 100 మందిలో 40 మందికి రక్తపోటు, చక్కెర వ్యాధులు సహజమని సరైన సమయంలో అదుపు చేసుకుంటూ ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. వీటిని నియంత్రించాలంటే మనిషి సహజసిద్ధమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొండే కృష్ణ, వీర్ల రమేష్, నల్లగోపు పుల్లయ్య, ఉడుగుల శ్రీకాంత్, వీరబాబు, అశోక్, శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు.