Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు ప్రాంతాలలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ అధికారులు అన్ని విధాలా ముందస్తు తగు చర్యలు తీసుకోవాలని, భద్రాచలం పట్టణం ముంపుకు గురి కాకుండా గోదావరీ కరకట్ట స్లూయిజ్‌ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ రాజుపేట-బి శాఖా వార్షికోత్సవ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని క్లోరిన్‌తో శుద్ధి చేసిన మంచినీటిని ప్రజలకు సరఫరా చేయాలని, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ మొదలగు విష జ్వరాలకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందించే విధంగా అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని అన్నారు. భద్రాచలం పట్టణంలోని గోదావరి కరకట్ట స్లూయిజ్‌లు లీకు కాకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కరకట్టకు ఇరువైపులా ఉన్న చెట్లు వేర్లు కరకట్ట పగుళ్లకు దారితీస్తున్నాయని వాటిని తొలగించాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, వార్డు కన్వీనర్ డి.సీతాలక్ష్మి, శాఖ కార్యదర్శి డి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.