Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- కిష్టాపురంలో దళితబంధు యూనిట్లు పంపిణీ
నవతెలంగాణ- సత్తుపల్లి
నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు పథకం ద్వారా యూనిట్లను అందించే బాధ్యత నాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. ఆదివారం సత్తుపల్లి మండలం కిష్టాపురంలో దళిత వర్గానికి చెందిన 7గురుకి దళితబంధు ద్వారా మంజూరైన యూనిట్లను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సండ్ర మాట్లాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా బ్యాంకు గ్యారంటీ లేకుండా ఒక్కో లబ్ధిదారుడికి రూ. 10లక్షలు సాయం నేరుగా ఖాతాల్లో వేసే ప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. దీనిని రాజకీయం చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. విడతల వారీగా అందరికి ఈ పథకం అందుతుందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి మరో 1500 యూనిట్లు దళితబంధు యూనిట్లు మంజూర య్యాయన్నారు. కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంద న్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ దొడ్డా హైమవతి శంకరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామ హేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కొత్తూరు ఉమామ హేశ్వరరావు, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీటీసీ తుంబూరు కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ దరావత్ పుల్లమ్మ, తుంబూరు సొసైటీ అధ్యక్షుడు చిలుకుర్తి కృష్ణమూర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, పాల్గొన్నారు.