Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ టీచర్లకు అదనపు పని భారంగా మారిన వైనం
- పట్టించుకోని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
చిన్నారుల ఆలనా..పాలనా చూసే ఆయమ్మలు లేక పలు చోట్ల అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు అవస్థలు పడుతున్నారు. దీంతో పిల్లలకు ఆటపాటలతో విద్యా బుద్దులు నేర్పించాల్సిన అంగన్వాడీ టీచర్లకు అదనపు పనిభారంగా మారింది. పర్యవేక్షించాల్సిన ఉన్నతాదికారులు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించక పోవడంతో ఆయమ్మలు లేని అంగన్వాడీ కేంద్రాలు తల్లి దండ్రులు లేని నిలయాలుగా మారాయనే చెప్పవచ్చు.
దుమ్ముగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిదిలోని మొత్తం ఏడు సెక్టార్లు ఉన్నాయి. మొత్తం ఏడు సెక్టార్ల పరిధిలో మెయిన అంగన్వాడీ కేంద్రాలు 118 ఉండగా మినీ అంగన్వాడీ కేంద్రాలు 50 ఉన్నాయి. పర్ణశాల సెక్టార్ పరిధిలో పర్ణశాల, సీతానగరం, ఎస్ కొత్తగూడెం, పెద్దనల్లబల్లి 01, తాటివారిగూడెం అంగన్వాడీ కేంద్రాలకు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు దుమ్ముగూడెం సెక్టార్ పరిధిలోని దుమ్ముగూడెం 02, గంగోలు, ములకపాడు అంగన్వాడీ కేంద్రాలలో ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా ఆర్లగూడెం సెక్టార్ పరిధిలోని అంజిబాక, అచ్చుతాపురంతో పాటు మారాయిగూడెం సెక్టార్ పరిధిలోని రామచంద్రునిపేట, సింగవరం అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. నర్సాపురం సెక్టార్ పరిధిలోని తూరుబాక, మారేడుబాక, రామారావ ుపేట 01లు ఖాళీగా ఉండగా భద్రాచలం సెక్టార్ పరిధిలోని కొత్తపేట, కొత్త కాలనీ, ఏఎస్ఆర్ సెక్టార్ పరిధిలోని రాజుపేట కాలనీ, ఏఎమ్సి కాలనీలలో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఏడు సెక్టార్ పరిధిలో 19 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు భద్రాచలం సెక్టార్ పరిధిలో కొత్తవాడ మినీ అంగన్వాడీ సెంటర్ టీచర్ పోస్టు ఖాళీగా ఉండగా ఏఎస్ఆర్ సెక్టార్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీ మెయిన్ అంగన్వాడీ కేంద్రం టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. దుమ్ముగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఏడు సెక్టార్ల పరిధిలో 19 ఆయా పోస్టులు, మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్టు 01, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టు 01 భర్తీ చేయాల్సి ఉంది.
పట్టించుకోని ఉన్నతాధికారులు : దుమ్ముగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం ఆయా పోస్టులు 19, మెయిన్, మినీ అంగన్వాడీ టీచర్ల పోస్టులు గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నప్పటికి ఉన్నతాధఙకారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయమ్మలు లేని అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులను ప్రతి రోజు ఇంటికి వెళ్లి తీసుకు వచ్చి వారిని మరలా ఇంటికి పంపాలి అంటే అంగన్వాడీ టీచర్లకు అదనపు భారం కావడంతో పాటు చిన్నారులకు సైతం సరైన పోషణ అందని పరిస్థితి నెలకొంటుందనే చెప్పవచ్చు. దీంతో పాటు టీచర్లు లేని అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు ఆట, పాటలకు విద్యాబుద్దులకు దూరం అవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఖాళీగా ఉన్న ఆయమ్మ పోస్టులతో పాటు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చిన్నారుల తల్లి దండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై సీడీపీఓ నవ్యశ్రీ వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.