Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర నేత రావులపల్లి
నవతెలంగాణ-భద్రాచలం
భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ... పోడు సాగుదారుల హక్కుల కొరకు సాగులో ఉన్న భూముల పట్టాల కొరకు గిరిజన ప్రజల పక్షాన సిపిఐ పోరాడుతుందని తెలిపారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్, పోలీస్ అధికారుల దాడులు ఆపకపోతే ఏజెన్సీలో మరో తిరుగుబాటు తప్పదని స్పష్టం చేశారు. వర్షం కారణంగా సోమవారం జరగబోయే ఐటిడిఏ కార్యాలయం ముందు ధర్నాలు వాయిదా వేసినట్లు ఈనెల 18 నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి బల్లా సాయికుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి కోలిపాక శివ తదితరులు ఉన్నారు.