Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛత్తీస్గడ్లో పుట్టి తెలంగాణలో పరవళ్ళు
- వందల ఎకరాల సేద్యానికి అనువుగా తాలిపేరు జలాశయం
- తాళిపేరు 16 గేట్లు ఎత్తి 24వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
నవతెలంగాణ-చర్ల
అల్పపీడనద్రోనితో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సరిహద్దు ఛత్తీస్గడ్ నంబి వాగు, గలగం వాగు, రాళ్ల వాగు, భీమవరం వాగు చింత వాగు ప్రమాద స్థాయిలో ప్రవహించి తాలిపేరు వాగులో కలవడం వలన కలిపేరు పరవాలేదు తొక్కుతూ దండకారణ్యంలో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తాలిపేరు జలాశయంలో కలుస్తుంది.
ఛత్తీస్గడ్లో పుట్టి తెలంగాణలో పరవళ్ళు తొక్కుతున్న తాళి పేరు
సరిహద్దు ఛత్తీస్గడ్ దళితవాడ జిల్లా దండకారణ్యంలో చిన్న కాలువ వలె పుట్టి సరిహద్దు బీజాపూర్ జిల్లా అడవుల్లో పరవళ్ళు తొక్కుతూ తెలంగాణ తాలి పేరు జలాశయంలో తాలిపేరు వాగు చేరుతుంది. దంతవాడ జిల్లాలోని బైలాడిలా కొండల్లో పచ్చని ప్రకృతి అందాల నడుమ ఉరకలు వేస్తూ కొండ కోనల దాటుకుంటూ బీజాపూర్ జిల్లాల్లోకి వచ్చి బాసగుడం, పూజారి కాంకేర్ పూసుగుప్ప, వద్దిపేట, ఉంజుపల్లి ఆదివాసి గ్రామాలను కలుపుకుంటూ తలపై రిజర్వాయర్లోకి చేరుతుంది. అయితే చతిస్గఢ్లో కంటే తెలంగాణలోకి చేరుకున్న తర్వాత తాలిపేరు ఉదతి పెరిగి పరవాళ్ళు తొక్కుతూ తెలంగాణ రాష్ట్రానికి మణిపూస వలె తయారయింది. 1985లో ప్రారంభించబడిన తాలిపేరు ప్రాజెక్టు కొన్ని వేల ఎకరాల సేద్యానికి అనుకూలంగా సాగునీటిని అందిస్తుంది. తాళి పేరు జలాశయంలో గల సాగునీరు చర్ల దుమ్ముగూడెం మండలాల్లోని సుమారు 26 వేల ఎకరాల భూ సేద్యానికి సానుకూలంగా ఉంది.
తాలి పేరు జలాశయం 16 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల
అల్పపీడనం ద్రోని ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి 24,366 క్యూసెక్కుల నీరుచెరగా ముందస్తు జాగ్రత్త కోసం అధికారులు ఆదివారం సాయంత్రం వరకు 16 గేట్లు పూర్తిగా ఎత్తి 24,366 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. జలాశయం సామర్థ్యం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి నిలువ 70.18 మీటర్లు ఉంచి అధికంగా ఉన్న నీటిని విడుదల చేస్తున్నట్లు తాళి పేరు డీఈ ఈ.తిరుపతి తెలిపారు.