Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ- రోహిత్ రాజ్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
నిషేధిత మావోయిస్టులకు అవసరమైన సామగ్రిని చేరవేసే ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. శనివారం ఏఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుమ్ముగూడెం పిఎస్ పరిధిలోని చిన్ననల్లబల్లి సెంటర్లో ఎస్సై రవికుమార్, సీఆర్పిఎఫ్, పోలీస్ బలగాలతో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం నుండి చర్ల వైపు ఏపి 20 ఎన్ 8102 అనే నెంబరు గల ద్విచక్ర వాహనం పై ఇద్దరు వ్యక్తులు వస్తూ పోలీస్ వారిని చూసి పారి పోవడానికి ప్రయత్నించారు. పోలీస్ వారు వారిని వెంబడించి పట్టుకుని విచారించగా మొగదటి నాగయ్య, ఏపి రాష్ట్రంలోని ఏలూరు జిల్లా అగ్రిపల్లి మండలం ఈదర గ్రామం కాగా ప్రస్తుతం భద్రాచలంలోని రాజుపేట గ్రామం కాగా రెండవ వ్యక్తి పుల్లూరి శ్రీహరిబాబు చుంచుపల్లి మండలం రామవరం గ్రామంగా తెలిపారు. వీరు గత కొంత కాలంగా నిషేధిత మావోస్టులకు అవసరమైన సామాగ్రి డబ్బులు సరఫరా చేస్తున్నామని పోలీసుల విచారణతో తెలిపారు. అందులో భాగంగా మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకు ఇసుకు కాంట్రాక్టర్ గొర్రెల బుచ్చిరాజు, చుంచుపల్లి మండలం రామవరం గ్రామానికి చెందిన రామగిరి నాగరాజుల వద్ద లక్ష రూపాయల నగదుతో పాటు విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు తీసుకు వెళుతున్నామని విచారణ తెలపడంతో ద్విచక్రవాహనంతో పాటు నగదు, విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకుని పై ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆయన తెలిపారు.మావోయిస్టు పార్టీకి ఎవ్వరు సహకరించవద్దని ఎవరైనా చందాల కోసం బెదిరింపులకు పాల్పడితే పోలీస్ వారికి తెలియజేయాలి అని ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో సిఐ దోమల రమేష్, ఎస్సై రవికుమార్ పాల్గొన్నారు.