Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు ఉత్పన్నమవుతున్నా నేపథ్యంలో కౌన్ బనేగా వైరా బాస్ అంటూ ఎన్నికల వేడి కాకా పుట్టిస్తోంది. వైరా నియోజకవర్గాల పునర్విభజన భాగంగా 2009 సంవత్సరంలో వైరా నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకొక్కరికి ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తూ ప్రజలు మార్పు కోరుతూ వస్తున్నారు.
- ఒక సారికి సై.. రెండోసారికి నై అంటున్న నియోజకవర్గ ప్రజలు..!
- అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నా మాజీలు...
నవతెలంగాణ-కొణిజర్ల
మొట్ట మొదటి సారిగా 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి డాక్టర్ బాణోత్ చంద్రావతి గెలిచి అతిచిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా బాణోత్ మదన్ లాల్ అప్పటి వైసిపి ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకరంతో టీడీపీ అభ్యర్థి బాలాజీపై గెలుపొందారు. ఈ నేపథ్యంలో నాటి ఎంపీ పొంగులేటీతో విభేదించి నియోజకవర్గ అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్లో చేరి పొంగులేటితో వైర్యం కొనసాగించారు. అదే విధంగా 2019 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన లావుడియా రాములు నాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకరంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రైతు నాగలి గుర్తుతో పోటీ చేసి అధికార పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్‌పై గెలిచి జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి చరిత్రను తిరగరాసారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నానని చెప్పి వెంటనే అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరారు. ఇలా ఇప్పటి వరకు మూడు దఫాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురుని ప్రజలు ఎన్నుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని నియోజకవర్గానికి బాస్‌ను చేస్తారోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు బాణోత్ చంద్రావతి, మదన్ లాల్ తాజా ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజలు అసంతృప్తి ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రావతి టికెట్ తనకే వస్తుందంటూ నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రజలను కలుస్తూ నాయకులకు ఫోన్లు చేస్తూ టచ్‌లో ఉంటున్నారటా. తనకు ఐటిశాఖ మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం చేస్తూ నియోజక వర్గాన్ని చూట్టేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్పతేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ మండల కేంద్రాల్లో తన అనుచరులతో మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తూ టికెట్ తనకే వస్తుందని ఎవరు అధైర్య పడవద్దని తనకు జిల్లా మాజీ మంత్రి సహకరం కూడా ఉందని నాయకులు కార్యకర్తలు ఉత్సహపరుస్తూ ముందుకు సాగుతూ తన మార్కు చూపిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుత ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మాత్రం మాజీ ఎమ్మెల్యేలు పర్యటనలు సమావేశాలను అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. తను ఇండిపెండెంట్ గా గెలిచి టీఆర్ఎస్లో చేరినప్పుడు ఒప్పందంలో భాగంగా సిట్టింగ్ సీటు ఇస్తానంటేనే పార్టీ మారిన విషయం అందరికీ తెలిసిందేనని, టికెట్ తప్పకుండా తనకే వస్తుందని అందుకే ధీమాగా ఉన్నానని తన అనుచరులు ఎవరు బయపడాల్సిన పనిలేదని ధైర్యంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. అధికార పార్టీ నుంచి ఇద్దరు మాజీలు తాజా ఎమ్మెల్యే ల మధ్య రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రమైన పోటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు మధ్య పోటీ మరో కొత్త వ్యక్తి కి కలిసివచ్చే ఆవకాశాలు ఉన్నాయని అ అదృష్టవంతుడు ఎవరై ఉంటుంరో అనేది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలే నిర్ణయించాల్సి ఉంటుంది.
ఇది ఇలా ఉండగా మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బాణోత్ బాలాజీ 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీచేసి స్వల్పతేడాతో మదన్ లాల్ పై ఓడిపోయారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తానుసైతం అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. టికెట్ దక్కకపోతే ఏదో ఒక పార్టీ నుంచి పోటీచేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా భావించి జూలురుపాడు మండలానికి చెందిన యువకుడు విద్యావంతుడైన ధరావత్ రాంబాబు సైతం నియోజకవర్గంలో పట్టుసాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెరవెనుక నుంచి అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య ఇంకా ఎంతమంది ఉంటారోననేది వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే. ఒకసారి కి సై రెండోసారి కి నై అంటూ మార్పుకోరే నియోజకవర్గ ప్రజలు ఎవరికీ పట్టం కడతారో అనేది ఆసక్తికరంగా మారింది.ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ గెలువకపోవడంతో ఇప్పటివరకు గెలవలేదు.