Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత చైతన్య స్ఫూర్తి సభలో జీవన్‌లాల్
నవతెలంగాణ-కొణిజర్ల
ప్రతి విద్యార్థి తమ లక్ష్యం కోసం తమకు తాముగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని దేశం గర్వించే స్థాయికి ఎదగాలని, ప్రతి విద్యార్థీ అబ్దుల్ కలాంలా తయారవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆదాయపు పన్ను కమిషనర్ లావుడియా జీవన్‌లాల్ విద్యార్థులకు సూచించారు. మండల పరిధిలోని తనికెళ్ల సమీపంలో గల విజయ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఏడవ వర్ధంతి సభను వైబ్రేట్స్ ఆఫ్ కలం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. యువతలో స్ఫూర్తిని రగిలించేలా 'బర్నింగ్ డిజైర్' అనే నినాదంతో సంస్థ వ్యవస్థాపకులు విజరు కలం అధ్యక్షతన జరిగిన సభలో జీవన్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో పిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్, వైబ్రేట్ ఆఫ్ కలాం నేషనల్ ప్రెసిడెంట్ శివప్రసాద్, ఎంపీపీ మధుసూదన్, కళాశాల ప్రిన్సిపాల్ రామ సుబ్బారెడ్డి ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు తాటిపల్లి సుధీర్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో మండల నాయకులు బండారు కృష్ణ, చల్ల మోహన్‌రావు, పోట్ల శ్రీనివాసరావు, చిరంజీవి, కళాశాల హెచ్ఓడి చెన్నయ్య, సాజిదా తదితరులు పాల్గొన్నారు.