Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీలో ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఇల్లందు
తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా గర్వించే స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి నియోజకవర్గానికి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం హరిప్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింగరేణి సహకారంతో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫౌండేషన్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల కోసం, ఉద్యోగ సాధన అధ్యాయంగా ఏకాగ్రతతో ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా కష్టపడి చదవాలన్నారు. అనంతరం శిక్షణ పొందుతున్న పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ ఉచిత స్టడీ మెటీరియల్స్ అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సింగరేణి సేఫ్టీ అధికారి శ్రీనివాస్, సింగరేణి ఎస్టేట్ అధికారి మహేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, హరి సింగ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, జిల్లా రైతు బంధు సభ్యులు పులిగండ్ల మాధవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హరిప్రియ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు 12వ వార్డు కౌన్సిలర్ సిలివేరి అనిత సత్యనారాయణ, పట్టణం ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షుడు పెండ్యాల హరికృష్ణ, గుండా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.