Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లిరూరల్
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్నం భోజనానికి సన్న రకం బియ్యం ఇవ్వాలని సత్తుపల్లి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని కాకర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్నం భోజనాన్ని పార్టీ బృందం పరిశీలించింది. నాయకులు భోజనం తిని చూశారు. అనంతరం జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూప్రభుత్వం పంపుచున్న నాసిరకం రైస్‌లో 'మల్టీ గ్రెయిన్ రైస్ ' కలిసి ఉండడం వల్ల భోజనం సరిగ్గా ఉడకలేదన్నారు. విద్యార్థులు చాలా వరకు భోజనం చేయలేక పోతున్నారన్నారు. కొందరు తమ ఇండ్లకు వెళ్లి భోజనం చేయవలసిన పరిస్థితిని మనం చూస్తున్నామ న్నారు. తప్పని సరి పరిస్థితిలో తిన్న విద్యార్థులకు జీర్ణ కాక కొత్త కొత్త రకాల అనారోగ్యం పాలు కావడం ఖాయంగా కనిపిస్తుందని జాజిరి అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా ఈ పాఠశాలలో రెండు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని భర్తీ చేయాలన్నారు స్వీపర్ లేరు, వర్షం నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. మన ఊరు మన బడి కార్యక్రమంలో మండలంలోనే ముందు వరసలో వున్న ఈ పాఠశాలలోనే ఇన్ని సమస్యలు ఉంటే, మిగతా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాల న్నారు. అందుకు నిలు వెత్తు సాక్షిగా పక్కనే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కనిపిస్తుందన్నారు. ప్రాథమిక పాఠశాల ఒకటి వున్నదన్న సంగతే, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మరసి పోయినట్లున్నారని జాజిరి ఎద్దేవ చేశారు. పాఠశాల తరగతి గదులకు సరైన తలుపులు, కిటికీ డోర్లు లేక స్థానిక మందు బాబులకు నిలయంగాను, పాయఖానా గదులుగాను మారిపోయా యన్నారు. ఏండ్లు గడుస్తున్నా తిరిగి నిర్మాణం చేపట్టక పోవడంతో మధ్యాహ్నం భోజనం వర్కర్స్ అనేక ఇబ్బందులకు పడుతూ వస్తున్నారని జాజిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయుకులు వేపులపాటి కుమారస్వామి, బండి వేలాద్రి, విద్యాకమిటీ చైర్మన్ రాగం సత్యనారాయణ, ప్రధాన ఉపాధ్యాయులు జయరాజు,మధ్యాహ్నం భోజన ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.