Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్న రహదారులు
- నిలువెత్తు నిర్లక్ష్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు
- అధికారం మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు
- ఈ రోడ్డు యమ డేంజర్
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల కాలంలో వైరా నుంచి పాలడుగు గ్రామాల మధ్య పూర్తిగా పాడైపోయిన రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. వైరా నియోజకవర్గం తాజా, మాజీ ప్రజాప్రతినిధులకు అధికారం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం మీద లేదు.
నవతెలంగాణ-వైరా టౌన్
వైరా నుంచి పాలడుగు గ్రామాల మధ్య రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. మోకాళ్ళ లోతు గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డు మీద ఏర్పడిన భారీ గుంతకు సంవత్సరాల తరబడి మరమ్మతులు చేయకపోవడం వలన ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. భారీ గుంతల వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నవి. కొంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పో తున్నారు. మరి కొంత మంది కాళ్ళు, చేతులు విరిగి ప్రాణాపాయ స్థితిలో పడుతున్నారు.
ప్రాణాలు తీస్తున్న రహదారులు..
ఈనెల 17న సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని సోమవారం గ్రామం నివాసితులు అమరేసు దుర్గ, ఆమె కుమారుడు ద్విచక్ర వాహనం మీద వి.వెంకటయ్యపాలెం గ్రామంలో అంత్య క్రియలకు వెళ్ళివస్తూ వైరా మండలం గొల్లపూడి గ్రామం వద్ద రోడ్డుపై అధ్వానంగా ఉన్న గుంతలు వల్ల ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. అమరేసు దుర్గ (45) తలకు బలమైన గాయమై మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఏప్రిల్ 25, 2022 సాయింత్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కోడూరు గ్రామానికి చెందిన దంపతులు ఏడుకొండలు, శేషమ్మ ఏన్కూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపైన వెళ్తుండగా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవరం వద్ద ఉన్న పెద్ద గుంతలు వలన బండి అదుపుతప్పి కిందపడి భార్య శేషమ్మ కుడి చెయ్యి విరిగింది. అటుగా వెళ్తున్న ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత, వైరా బాలాజీ నర్సింగ్ హౌంకు తీసుకెళ్ళి ప్రాథమిక వైద్యం చేయించారు. తర్వాత విజయవాడ హాస్పిటల్లో శేషమ్మ చేతికి ఆపరేషన్ చేసి రాడ్డు వేసినారు. ఈ రోడ్డులో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
నిలువెత్తు నిర్లక్ష్యం : ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత
భారీ గుంతలకు సంవత్సరాల తరబడి మరమ్మతులు చేయకపోవడం వలన ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు అధ్వానంగా ఉన్న రోడ్డు పైన ప్రయాణం చేస్తూ కూడా కనీసం స్పందించటం లేదు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా గుంతలకు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా నిలువెత్తు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.