Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఔదార్యం చాటుకున్న జాలే రామకృష్ణారెడ్డి
నవతెలంగాణ-అశ్వాపురం :
గోదావరి వరదలు ముంపుకు గురైన నెల్లిపాక, నెల్లిపాక బంజర, టేకుల గుట్ట గ్రామస్తులకు మొండికుంట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు జాలే రామకృష్ణారెడ్డి లక్ష రూపాయల నగదును బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా ఆయన ప్రారంభించారు. ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున అందజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు నిత్యవసరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు నగదును అందజేయడం పట్ల ఆయన అభినందనీయం వ్యక్తం చేశారు. ఇలాగే దాతలు ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొర్రె ముచ్చు వెంకటరమణ, ఎంపీటీసీ గాదె పద్మ, తహసిల్దార్ వి సురేష్ కుమార్, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.