Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిండుకుండలా తాలిపేరు జలాశయం
- 25 గేట్లు పూర్తిగా ఎత్తి 1,78,6 54
క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
నవతెలంగాణ-చర్ల
వాతావరణంలో ఏర్పడిన పెను మార్పులతో మరెప్పుడూ లేనంతగా సరిహద్దు ఛత్తీస్గడ్ దండకారణ్యంలో సైతం వర్షాలు దంచి కొడుతున్నాయి. అరణ్య ప్రాంతంలో ఏర్పడిన జల ప్రళయం దండకారణ్యాన్ని తుడిచిపెట్టుకొని వస్తూ తాలిపేరులో కలవడంతో తాలిపేరు ఉరకలు వేస్తూ పరవళ్ళు తొక్కుతోంది.
పరవాళ్ళు తొక్కుతున్న తాలిపేరు
సరిహద్దు ఛత్తీస్గడ్ దంతేవాడ జిల్లా బలాడీలా కొండల్లో పురుడుపోసుకున్న తాలిపేరు తెల్లని పాలవల్లే ప్రవహించి సంకిని, ఢంకినిలను ముద్దాడి ఎర్రని చిందూరంలా ఉరకలు పరుగులు తీస్తూ బీజాపూర్ జిల్లా బాసగూడెం మీదుగా మహా ఉగ్రరూపం దాల్చి ప్రవహించి గలగం వాగు, రాళ్లవాగు, నంబి వాగు, భీమారం వాగులను కలుపుకొని మరింత దూకుడుగా సరిహద్దు పూసుగుప్ప వద్ద తెలంగాణలో దుమికి పూసు వాగు, చీకటి వాగు, జెర్రిపోతుల వాగులను కలుపుకొని ఇటు తెలంగాణ అటు సరిహద్దు ఛత్తీస్ఘడ్ను విడదీస్తూ చింతలనార్ ప్రాంతం నుండి రక్తపుటేరులా పారే చింత వాగును కలుపుకొని చలమల వద్ద తాలిపేరు జలాశయంలో చేరుతుంది. ఛత్తీస్గడ్ దండకారణ్యంలో కేవలం గంటపాటు కురిసిన వర్షానికి ఆలి పేరు జలాశయం నిండుకుండలా మారుతుంది.
నిండుకుండలా తాలిపేరు జలాశయం
జులాయి మొదటి వారం నుండే విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తల్లి పేరు జలాశయం నిండుకుండలా మారింది. వాగులు వంకలు, పొంగి తాలిపేరు జలాశయంలో చేరడంతో తాలిపేరు ప్రాజెక్టు కనుచూపుమేరా నీటితో నిక్షిప్తమై ఉంది. మండలంలో చెరువులు సముద్రాలను తలపిస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా జలకలతో మండలమంతా కలకలలాడుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు పోటెత్తిన జలాశయంలోకి 1,77 693 క్యూసెక్కుల నీరు తాలింపు ప్రాజెక్టులోకి చేరుతుండగా అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేసి అధికంగా ఉన్న వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.
తాలి పేరు ప్రాజెక్టు 25 గేట్లు పూర్తిగా ఎత్తి 1,78,6 54 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
ఉరకలు వేస్తూ పొంగిపొర్లుతున్న తాలి పేరు జలాశయంలోకి చేరుతున్న నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులు అధికంగా ఉన్న నీటిని తాలుపెరుకు ఉన్న 25 గేట్లను పూర్తిగా ఎత్తి 1,78,6 54 క్యూసెక్కుల వరద నీటిని దిగువనం ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 74 మీటర్లు కాగా ప్రస్తుత 73.00 మీటర్ల నీటిని జలాశయంలో నిల్వ ఉంచి అధికంగా ఉన్న వరదను దిగు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారి డీఈ తిరుపతి తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు పర్వల్లు తొక్కుతూ తాలిపేరు 1,76,130 క్యూసెక్కుల నీరు జలాశయంలో చేరగా ముందస్తు జాగ్రత్త కోసం మొత్తం 25 గేట్లను పూర్తిగా ఎత్తి 1,79, 966 క్యూసెక్కుల నీటిని దిగివకు విడుదల చేశారు అనంతరం 12 గంటలకు సైతం తాళి పేరు ఉదత కొనసాగుతుండటంతో అధికారులు 25 గేట్లను పూర్తిగా లేపి ఉంచి 1,78 654 క్యూసెక్కుల నీటిని దిగకు విడుదల చేశారు. ఎగువ నుండి వస్తున్న జలప్రళయాన్ని క్షణం క్షణం గమనిస్తూ అధికంగా ఉన్న వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు.