Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- పంపిణీకి సిద్ధంగా రూ.1.5లక్షల విలువగల సరుకులు, దుప్పట్లు
నవతెలంగాణ- సత్తుపల్లి
గోదావరి వరద బాధితులను ఆదుకొనేం దుకు ఆర్యవైశ్యులు ముందుకు రావడం అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. వరద బాధితుల సహాయార్థం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, వాసవీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేసేందుకు శనివారం స్థానిక కిరాణా మర్చంట్స్ కళ్యాణ మండపంలో సిద్ధం చేసిన నిత్యావసర సరుకులు, దుప్పట్లు, కండువాలను తరలించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర సమక్షంలో ప్రారంభించారు. ఆర్యవైశ్య నాయకులు గుడిమెట్ల గాంధీ, వనమా వాసుదేవరావు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సండ్ర సూచన మేరకు తాము రూ. 1.5లక్షలతో 150 నిత్యావసర సరుకుల కిట్లు, దుప్పట్లు, కండువాలు 600 చొప్పున సిద్ధంచేసి ఆంధ్రప్రదేశ్‌లోని వేలేరుపాడు మండలం పూచిరాల ఆదివాసీ కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆర్యవైశ్య సంఘ నాయకులు నడిపల్లి లక్ష్మీనారాయణ, వేముల శ్రీనివాసరావు, గుండు ఉమా, ప్రసాద్, బచ్చు ధర్మారావు, గంగిశెట్టి కన్నా, జల్లిపల్లి చక్రధరరావు పాల్గొన్నారు.
పరిహారం బాధిత కుటుంబానికి అందజేత
నియోజకవర్గంలో బాధిత కుటుంబాలకు అవకాశం ఉన్నంత వరకు సాయం అందేలా కృషి చేయడం జరుగుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో విద్యుత్ షాక్‌తో మృతిచెందిన యువకుని కుటుంబానికి విద్యుత్‌శాఖ ద్వారా మంజూరైన రూ. 5లక్షల పరిహారాన్ని శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరకు చెందిన నేర్ల ఏసు కుమారుడు గోపాలకృష్ణ (23) 1నే యువకుడు విద్యుత్ స్థంబాల పనులకు కూలీగా వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మరణించిన నేపధ్యంలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిహారం అందేలా కృషి చేశారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మృతుని కుటుంబ సభ్యులకు పైన తెలిపిన విలువగల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఏడీఈ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.