Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలి
- సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-చింతకాని
భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను, వరదల్లో కొట్టుకపోయిన ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ మోటార్లు, స్తంభాలకు మరమ్మతులు, వర్షానికి కూలిన ఇండ్లు, ఇంటి గోడల బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం చింతకాని సిపిఎం మండల కమిటీ సమావేశంలో అయన మాట్లాడుతూ వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో వేలాది ఎకరాలకు పైగా పంటనష్టం జరిగిందన్నారు. పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, తదితర పంటలు ఎక్కువగా నీట మునిగి నష్టపోయాయని తెలిపారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నష్టాన్ని రైతుబంధుతో ముడిపెట్టి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వడం లేదని, రైతు బంధును సర్వరోగ నివారిణిగా ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. రైతు సమస్యలు, ఇతర సబ్సిడీలను, మూడేళ్లగా పంట నష్టపరిహారంలపై పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.20 వేల నష్ట పరిహారం ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు, తోటకూరి వెంకటనర్సయ్య, పులి యజ్ఞనారాయణ, గడ్డం రమణ, మద్దిన్ని బసవయ్య, బల్లి వీరయ్య, దేశబోయిన ఉపేందర్, కాటబత్తిన వీరబాబు, లింగం కోటేశ్వరరావు, పంగ గోపయ్య, షేక్ జానిమియా తదితరులు పాల్గొన్నారు.
బోనకల్ : తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను, ఎకరాకు 20 వేలు పంట నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనములో సిపిఎం మండల కమిటీ సమావేశం జొన్నలగడ్డ సునీత అధ్యక్షతన శనివారం జరిగింది. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు గుగులోతు పంతు, కిలారు సురేష్, గుడిపూడి వెంకటేశ్వర్లు, ఉమ్మనేని రవి, ఏడు నూతల లక్ష్మణరావు, కొమ్మినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.