Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలంలో గోదావరి ముంపునకు గురై పూర్తిగా ఇల్లు మునిగిపోయి ఇంట్లో సామాన్లు మొత్తం గోదావరి కొట్టుకపోయిన కుటుంబాలకు వరద సాయం, పరిహారం అందజేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వరద బాధిత కుటుంబాలతో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధిత కుటుంబాలకు ఉమ్మడి జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి సర్వే చేశారని ఆయన అన్నారు. ఆ సర్వే పూర్తిగా వరదబాధితులకు వ్యతిరేకంగా చేసిన సర్వే అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేయకపోవడం వల్ల ఈ లోపాలు జరిగాయని ఆయన అన్నారు. పూర్తిగా నీటిలో మునిగిపోయిన గ్రామాలు సుందరయ్య నగర్, గణేష్ కాలనీ, బస్సు క్యాంపు, గాంధీ నగర్, భాస్కర్ నగర్, బూర్గంపాడు, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, మోతే, ఇరవెండి, మేడే కాలనీ, ఇంకా ఇతర ప్రాంతాలు గోదావరి ముంపుకి గురైన కుటుంబాన్ని రీ సర్వే మళ్ళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కుటుంబాలకు రాసిన సర్వే ఫారాలు అధికారులకు సర్వే చేసిన వారు అందించిన అవి ఆన్లైన్లో కాలేదని ఆ కాగితాలు ఎక్కడో పోయినాయని చెబుతున్నారని ఆయన అన్నారు. గోదావరికి నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకుండా అధికారుల వైఫల్యమే కారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సర్వే చేసిన వరద బాధిత కుటుంబాలు వివరాలను బూర్గంపాడు డిప్యూటీ తహశీల్దార్ శివ కుమార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ పాపినేని సరోజన, భయ్యా రాము, ఎస్.కె అభిదా, కొమర్రాజు సత్యనారాయణ, కానితి నాగయ్య, విలా సాగర్ రజిని, మన్యెం చంద్ర, పెరిక లక్ష్మి, రామా, దుర్గ, వెంకటేశ్వర్లు, మంగ, పద్మ, నాగమణి, విలాసాగర్ భవాని, తదితరులు పాల్గొన్నారు.