Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి చేసిన ప్రకటనని అమలు చేయాలి
- దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన కార్మిక సంఘాలు, వివిధ పార్టీలు
నవతెలంగాణ-కొత్తగూడెం
వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనని వెంటనే అమలు చేయాలని సీఐటియూ పట్టణ కార్యదర్శి డి.వీరన్న, డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం నుండి రిలే దీక్షలు ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, లిక్కి బాలరాజు, కెవిపిఎస్ నాయకులు నందిపాటి రమేష్ సందర్శించారు. సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సెప్టెంబర్ 2020న అసెంబ్లీలో గ్రామ రెవిన్యూ సహాయకులు (వీఆర్ఏ)కి పే స్కేల్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి 10 నెలలు కావస్తున్నా నేటి వరకు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. వెంటనే వారి సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం వీఆర్ఏల సంఘం నాయకులు దవళ రాజు, నాగేశ్వరరావు, జానీ మియా తదితరులు పాల్గొన్నారు.
వీఆర్ఏలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి : బీఎస్పీ
వీఆర్ఏలను సర్దుబాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హామీని నిలబెట్టుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేస్తున్న దీక్షలో కూర్చొని, దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు గుడివాడ రాజేందర్, అల్లకొండ శరత్, తుమ్మ వంశీ, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ మండల నాయకులు కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు సతీష్, బాలకృష్ణ, నరేష్, ఆనందరావు, బుచ్చి రాములు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి : వీఆర్ఏలు చేపట్టిన తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి పిట్టల అర్జున్ మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడారు. ఈ సమావేశంలో వీఆర్ఎల మండల అధ్యక్షుడు కనకం శ్రీనివాస్, సమ్మయ్య, దేవమ్మ, లచ్చన్న, సీఐటీయూ మండల కన్వీనర్ రాంబాబు, నిమ్మల మధు, వీఆర్ఎలు పాల్గొన్నారు.
దమ్మపేట : వీఆర్ఎల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, పే స్కేలు అమలుకు జీవో వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. సోమవారం వీఆర్ఎ జేఏసీ పిలుపు మేరకు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రమేష్, విఆర్ఎ నాయకులు ప్రసాద్, బాబురావు, పాషా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ ముందు నిరసన ధర్నా చేపట్టినట్లు వీఆర్ఏలు సోమవారం తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వీఆర్ఏ సిబ్బంది పాల్గొన్నారు.
చండ్రుగొండ : వీఆర్ఏలకు పేస్కేల్ వెంటనే అమలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడారు. ఈ నిరసన దీక్షలో వీఆర్ఏల సంఘం జిల్లా కార్యదర్శి చాంద్ మీరా, మండల అధ్యక్షుడు లక్ష్మీపతి, మండల కార్యదర్శి జయరాజు, మౌలానా తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : వీఆర్ఏల పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల మండల అధ్యక్షులు కె.గణేష్, కార్యదర్శి గణేష్, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : వీఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ మేరకు సమ్మె చేపడుతున్నట్లు ఎస్ఐ అశోక్ రెడ్డికి వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఎలు రమేష్ ఊకే, లేడా చిలకరావు, నగేష్, రామారావు, వెంకటేశ్వర్లు, నాగలక్ష్మి, నాగరాణి, తదితరులు పాల్గొన్నారు.