Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చికెన్, మాంసం, హౌటల్ యజమానుల అత్యవసర
సమావేశంలో కమిషనర్ అంకూషావళి
నవతెలంగాణ-ఇల్లందు
వ్యాపార వాణిజ్య సముదాయాలు పరిశుభ్రంగా ఉంచాలని నిర్లక్ష్యం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ అంకూషావళి హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో సోమవారం చికెన్, మాంసం, హౌటల్, స్క్రాప్ యజమానులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సీజనల్ వ్యాధి నిర్మూలన చర్యల్లో భాగంగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. మాంస దుకాణాల దారులందరూ తమ దుకాణాల యందు మాంసం విక్రయాలు చేసేటప్పుడు వాటికి ఈగలు వాలకుండా తగిన జాలీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులను ప్రబాలించకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, సానిటరీ జవాన్లు పాల్గొన్నారు.