Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు ఆర్.రమాదేవికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) జిల్లా శాఖ ప్రాతినిధ్యం చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షులు బుటారి రాజు తెలిపారు. ఈనెల 11వ తేదీన గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు 19 ద్వారా పరస్పర అంతర్ జిల్లా బదిలీలు చేయబడిన ఉపాధ్యాయులు తమ తమ స్థానాల నుండి విడుదల పొందునట్లు సపోర్టింగ్ ఆదేశాలు ఇప్పించాలని, బదిలీల షెడ్యూలు గత నాలుగు సంవత్సరాల నుండి జారీ చేయబడనందున కొందరు ఉపాధ్యాయుల అనారోగ్యములు ఇతర కారణముల వలన స్థానాచలనం అనివార్యమైనందున గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ చేపట్టాలని, గత నెల 21న చేయబడిన ప్రాతినిధ్యపులేక పై కార్యాలయపు చర్యానివేదికను అందించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ బట్టా ప్రసాదరావు, జిల్లా కార్యదర్శి తాటి సత్తిబాబు, వట్టం ముత్తయ్యలు పాల్గొన్నారు.