Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలి
- వీడియో కాన్ఫెరెన్స్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
అంటువ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాల్లో పారిశుధ్య, ఐఆర్ఎస్ కార్యక్రమాలు ముమ్మరం చేసి వ్యాధి నియంత్రణ చర్యలు చేపడతామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆదివారం హైదరాబాదు నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు అంటు వ్యాధుల నియంత్రణ చర్యలు, సంక్షేమ హాస్టళ్లులో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ, డ్రై డే నిర్వహణ, విద్యార్ధుల ఆరోగ్య సంరరక్షణ చర్యలు, వరదలు, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా 142, డెంగీ 36, చికెన్‌గున్యా 2 కేసులు నమోదయ్యాయని ఆ ప్రాంతాల్లో పత్యేక పర్యవేక్షణకు టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాకు 50 వేల వరకు దోమతెరలు అవసరమున్నదని జిల్లా కలెక్టర్ తెలుపగా మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. టెస్టింగ్ కిట్లు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. కరోనా 2వ డోస్‌తో పాటు బూస్టర్ డోస్ ప్రక్రియను పూర్తి చేయుటకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.
వరదల్లో ప్రాణ నష్టం జరుగుకుండా చూడాలి రాష్ట్ర మంత్రులు
వరదల్లో ప్రాణ నష్టం జరుగుకుండా తీసుకున్న జాగ్రత్తలు, ప్రత్యేక చర్యలు చాలా బాగా పనిచేశారని అభినందించారు. గ్రామ స్థాయిలో క్లోరిన్, యాంటి లార్వా మెటీరియల్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. యాంటి లార్వా ఆపరేషన్లు, డ్రై డేలు పాటించాలని చెప్పారు. వసతిగృహాల్లో పాత బియ్యం వినియోగించొద్దని ఆయన సూచించారు. జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు వసతిగృహాలను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని చెప్పారు. నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలని పంచాయతీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తికి మంకీ ఫాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.దయానందస్వామి, ఆసుపత్రి సర్యవేక్షకులు డాక్టర్ కుమారస్వామి, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరావు, జడ్పీ సిఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, మిషన్ బగీరథ ఈఈ తిరుమలేష్, ఇంట్రా ఈఈ నళిని, డిఆర్డీఓ అశోకచక్రవర్తి, ఆర్టీఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.